Friday, October 10, 2014


మనల్ని నిర్మించే  మాటలు 


ఈనాటి కుటుంభ , వైవాహిక జీవితాల్లో మనం అనుకోకుండా విఫలమైయ్యే సందర్భాలు అనేకం. ఈ వైఫల్యానికి ముఖ్య కారణంగా మన సరి లేని సంభాషణ, సంభంద భంధవ్యాల లేమి అని చెప్పొచ్చు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘస్తులకు లేఖ రాస్తూ 4:29 లో "వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. "   అని అనడం మనం చదువుతాం . 
రోజంతా మనం మన పని పాటల్లో , కుటుంభ వ్యవహారాల్లో చాలా పని బిజీ గా ఉంటూ మన పనులను చేయించుకోడానికి మన మాటలను వాడతాం . భావవ్యక్తీకరణ లేకుండా సంబంధ  భాందవ్యాలు  బలపడవు. సంభాషణలో దుర్భాషయేదైనా చోటు చేసుకుంటే అది ఎలా మనిషిని ఎదగనివ్వకుండా ఆపుతుందో, క్షేమాభివృద్ది కి సంభందించిన మాటలను మనం వాడినప్పుడు ఆ సంభాషణ ఎంత స్పూర్తిదాయకంగా ఉండి సంబంధ బాంధవ్యాలు ఎలా బలపడతాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పౌలు విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన మాటలనే పలకాలని సూచిస్తున్నట్టు గమనించవచ్చు.

చాలా సార్లు పిల్లను ఇలా  నిరుత్సాహ పరిచే మాటలు మాట్లాడుతూ వారిని అచేతనులుగా , నిజంగా పనికి రాని వారిగా మనమే చేస్తుంటాం. అలాంటి కొన్ని మాటలివిగో -" నీకేమి సరిగ్గా చేయడానికి రాదు కదూ ", - " ఎందుకు చెప్పినట్టు చేయవు నీ సమస్య ఏంటి అసలు ",-   "నీకెంత నేర్పినా వ్యర్ధమే  " -" నీకు రానే రాదు అసలు " -" నీలాంటి వానితో పెట్టుకున్నా చూడు నన్ను నేనే అనుకోవాలి ",  నువ్వస్సలు  మారవు " నీకు చేత  కాదు నన్ను చేయనివ్వు " -" పగలగొట్ట కుండా ఏ పని చేయలేవని నాకు ముందే తెలుసు" , - " నీ మీద నమ్మకం ఉంచా చూడు "  ఇలా చెబుతూ పొతే పెద్ద లిస్టు తయారవ్తుంది.  ఇలాంటి పదాలు , మాటలు మాట్లాడకుండా వారి క్షేమాభివృద్ది కోసం ఉపయోగపడే మాటలు మనం మాట్లాడలేమా ?? 

"99 ways to say 'very  good '" అనే లిస్టు పిల్లలకే గాని, యవ్వనస్తులకే గాని, పెద్ద  వాల్లకైనా క్షేమాభివృద్ది కలిగించే భావవ్యక్తీకరణలు మనకు నేర్పుతాయ్.- " ఇంతే ఎంత సులువో చూసావా " - " నువ్వు చాల కష్టపడి పని చేస్తున్నావ్ ",  " నిన్ను బట్టి నేను చాలా గర్వపడుతున్నాను ",  " నువ్వు సాధించగలవు " -" నువ్వు కాకుండా ఇది వేరే ఎవరు చేయలేరు ",  " ఇప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా .. ఇంకా పర్ఫెక్ట్ గా నువ్వు చేయగలవు " " మంచి ఆలోచన " ఇలాంటి మాటలు క్షేమాభివృద్ధి కలిగించడమే కాక సంబంధ బాంధవ్యాలను బలపరుస్తాయి. 

ఇదే విషయాన్ని పౌలు అంటున్నాడు మన మాటలు వినే వారికి వారి పరిస్థితుల్లో క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. అలా మాట్లాడడం  వల్ల వాళ్ళలో దయ , జాలి లాంటి సద్గుణాలను మనం నాటగలం , ఆత్మ ఫలాలను ఫలించేలా చేయగలం. వాళ్ళ జీవితాలపై ప్రభావాన్ని చూపగలం మార్పు తేగలం. 

ఇవ్వాళ్టి నుంచి మాట్లాడేముందు మనల్ని మనం ఒక సారి సరిచూసుకుందాం ఎలాంటి భావవ్యక్తీకరణ మనం చేస్తున్నాం. ఎదుటి వారికి క్షేమం కలిగించేదా ?? లేదా వారిని కట్టబడకుండా కూల్చేదా ?? ముఖ్యంగా చిన్నారులతో. 

చివరిగా ఒక్క విషయం ముషులకు ప్రోత్సాహపరిచేవారు , ధైర్యాన్ని నింపే వారు కావాలి. నిరుత్సాహపరిచి వారి మూలాలను బలహీన పరిచే వారు కారు."  ఇందులో నువెవ్వరు "   ???    

Button up your lip securely
'Gainst the words that bring a tear,
But be swift with words of comfort,
Words of praise, and words of cheer. —Loucks
A word of encouragement can make the difference between giving up and going on.

Friday, October 3, 2014

మన శక్తికున్న పరిమితులు
---------------------------------

దేవుడు మోషే ని తన పనికై పిలిచాడు. అవును 420 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను ఐగుప్తునుంచి బయటికి తీసుకుని రావడానికి. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసుగా " అప్పుడు మోషే - ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను "   అని అనడం నిర్గామకాండం4:10 లో చూస్తాం. 

మోషే మాటలను బట్టి చూస్తే ఆయనకు మాట్లాడేప్పుడు కలిగే ఇబ్బంది ఉన్నట్టు బాగా నత్తి ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు. నేను నత్తి వాణ్ని అని మోషే దేవునితో సమాధానం చెబుతుంటే దేవుడేమన్నాడో చూడండి. నిర్గమ 4:11  "యెహోవా - మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా."  అని. నోరుగల వాళ్ళని , మాట్లాడలేని వాళ్ళని , వినలేని వాళ్ళని , చూడలేని వాళ్ళని కూడా పుట్టించింది దేవుడే అని మనం చూస్తాం.  

మన బలహీనత, అశక్తత, వైకల్యాన్ని దేవుడు తన మహిమ గురించి వాడుకుంటాడు. ఆ బలహీనతల్ని కలగించడం ద్వారా దేవుడు మనల్ని  తక్కువగా చేసాడని కాదు కాని ఆయన ఆ బలహీనతల్ని తన మహిమ గురించి వాడుకోడానికి ఆ బలహీనతలో మనం  దేవునికి మరి దగ్గరగా చేరడానికే కలిగిస్తాడు. 
మన వైకల్యం ఆయన మీద ఆధారపడడానికే గాని ఆయనకు ఆటంకం కాదు. ఆయన మీద ఆధారపడుతూ ఆయనతో సంబంధాన్ని బలపరుచుకుంటూ , మన బలహీనతలో ఆయన శక్తిని రుచి చూస్తూ ఆయనలో ఆనందాన్ని పొందేందుకు మన వైకల్యం కారణమైతే ఎందుకు చిన్న తనంగా భావించాలి. 

అపోస్తులుడైన పౌలు నా బలహీనతను చూసి దాన్ని తొలగించు అని మూడు సార్లు దేవుని దగ్గర ప్రాధేయపడ్డట్టు చూస్తాం. అలా ప్రాధేయపడేప్పుడు వేడుకునేప్పుడు ఈ మాటలు కూడా ఆయన హృదయపూర్తిగా అన్నాడు - 2 కోరింథి 12:10 లో  "నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.  అప్పుడు ప్రభువు తనతో అన్న మాటలు తనకెంత ఆదరణ ఇచ్చి యుంటే అలా అనగలడు మన ప్రభువును రక్షకుడునైన యేసు ఏమన్నాడు  ఎందుకంత ఆదరణ పౌలు పొందగలిగాడు 2 కోరింథి 12:9 - "అందుకు - నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహుసంతోషముగా అతిశయ పడుదును."    

పౌలులా మనం ఎందుకు ఆలోచించ కూడదు?? మన బలహీనతలో , మన వైకల్యంలో ఆయనపై ఆధారపడుతూ ఆయనని దగ్గరగా చూస్తూ , ఆయన మహిమ కోసం ఆయన మనల్ని వాడుకునేప్పుడు ఎందుకు ఆయనకి మన జీవితాల్లో ప్రధమ స్థానం ఇచ్చి మన అశక్తతలో , మన బలహీనతలో , వైకల్యంలో ఆయన మహిమకోసం మనల్ని మనం సమర్పించుకోకూడదు. 

God uses weakness to reveal
His great sufficiency;
So if we let Him work through us,
His power we will see. —Sper
God's strength is best seen in our weakness.