మనల్ని నిర్మించే మాటలు
ఈనాటి కుటుంభ , వైవాహిక జీవితాల్లో మనం అనుకోకుండా విఫలమైయ్యే సందర్భాలు అనేకం. ఈ వైఫల్యానికి ముఖ్య కారణంగా మన సరి లేని సంభాషణ, సంభంద భంధవ్యాల లేమి అని చెప్పొచ్చు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘస్తులకు లేఖ రాస్తూ 4:29 లో "వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. " అని అనడం మనం చదువుతాం .
రోజంతా మనం మన పని పాటల్లో , కుటుంభ వ్యవహారాల్లో చాలా పని బిజీ గా ఉంటూ మన పనులను చేయించుకోడానికి మన మాటలను వాడతాం . భావవ్యక్తీకరణ లేకుండా సంబంధ భాందవ్యాలు బలపడవు. సంభాషణలో దుర్భాషయేదైనా చోటు చేసుకుంటే అది ఎలా మనిషిని ఎదగనివ్వకుండా ఆపుతుందో, క్షేమాభివృద్ది కి సంభందించిన మాటలను మనం వాడినప్పుడు ఆ సంభాషణ ఎంత స్పూర్తిదాయకంగా ఉండి సంబంధ బాంధవ్యాలు ఎలా బలపడతాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పౌలు విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన మాటలనే పలకాలని సూచిస్తున్నట్టు గమనించవచ్చు.
చాలా సార్లు పిల్లను ఇలా నిరుత్సాహ పరిచే మాటలు మాట్లాడుతూ వారిని అచేతనులుగా , నిజంగా పనికి రాని వారిగా మనమే చేస్తుంటాం. అలాంటి కొన్ని మాటలివిగో -" నీకేమి సరిగ్గా చేయడానికి రాదు కదూ ", - " ఎందుకు చెప్పినట్టు చేయవు నీ సమస్య ఏంటి అసలు ",- "నీకెంత నేర్పినా వ్యర్ధమే " -" నీకు రానే రాదు అసలు " -" నీలాంటి వానితో పెట్టుకున్నా చూడు నన్ను నేనే అనుకోవాలి ", నువ్వస్సలు మారవు " నీకు చేత కాదు నన్ను చేయనివ్వు " -" పగలగొట్ట కుండా ఏ పని చేయలేవని నాకు ముందే తెలుసు" , - " నీ మీద నమ్మకం ఉంచా చూడు " ఇలా చెబుతూ పొతే పెద్ద లిస్టు తయారవ్తుంది. ఇలాంటి పదాలు , మాటలు మాట్లాడకుండా వారి క్షేమాభివృద్ది కోసం ఉపయోగపడే మాటలు మనం మాట్లాడలేమా ??
"99 ways to say 'very good '" అనే లిస్టు పిల్లలకే గాని, యవ్వనస్తులకే గాని, పెద్ద వాల్లకైనా క్షేమాభివృద్ది కలిగించే భావవ్యక్తీకరణలు మనకు నేర్పుతాయ్.- " ఇంతే ఎంత సులువో చూసావా " - " నువ్వు చాల కష్టపడి పని చేస్తున్నావ్ ", " నిన్ను బట్టి నేను చాలా గర్వపడుతున్నాను ", " నువ్వు సాధించగలవు " -" నువ్వు కాకుండా ఇది వేరే ఎవరు చేయలేరు ", " ఇప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా .. ఇంకా పర్ఫెక్ట్ గా నువ్వు చేయగలవు " " మంచి ఆలోచన " ఇలాంటి మాటలు క్షేమాభివృద్ధి కలిగించడమే కాక సంబంధ బాంధవ్యాలను బలపరుస్తాయి.
ఇదే విషయాన్ని పౌలు అంటున్నాడు మన మాటలు వినే వారికి వారి పరిస్థితుల్లో క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. అలా మాట్లాడడం వల్ల వాళ్ళలో దయ , జాలి లాంటి సద్గుణాలను మనం నాటగలం , ఆత్మ ఫలాలను ఫలించేలా చేయగలం. వాళ్ళ జీవితాలపై ప్రభావాన్ని చూపగలం మార్పు తేగలం.
ఇవ్వాళ్టి నుంచి మాట్లాడేముందు మనల్ని మనం ఒక సారి సరిచూసుకుందాం ఎలాంటి భావవ్యక్తీకరణ మనం చేస్తున్నాం. ఎదుటి వారికి క్షేమం కలిగించేదా ?? లేదా వారిని కట్టబడకుండా కూల్చేదా ?? ముఖ్యంగా చిన్నారులతో.
చివరిగా ఒక్క విషయం ముషులకు ప్రోత్సాహపరిచేవారు , ధైర్యాన్ని నింపే వారు కావాలి. నిరుత్సాహపరిచి వారి మూలాలను బలహీన పరిచే వారు కారు." ఇందులో నువెవ్వరు " ???
Button up your lip securely
'Gainst the words that bring a tear,
But be swift with words of comfort,
Words of praise, and words of cheer. —Loucks
'Gainst the words that bring a tear,
But be swift with words of comfort,
Words of praise, and words of cheer. —Loucks
A word of encouragement can make the difference between giving up and going on.
No comments:
Post a Comment