పుట్ పాత్ పై కుర్రాడు
---------------------------------
ఓ కుర్రాడు స్కూల్ బాగ్ వేసుకుని , ఫుట్ పాత్ పైన పైకి కిందకి దూకుతూ ఆడుకుంటూ మాటికి తొంగి , ఆ రోడ్డు మలుపు వైపు చూస్తూన్నాడు . సాయంత్రం నడకకై బీచ్ కొచ్చిన పెద్దయనొకరు రెండు సార్లు అటు ఇటు తిరిగి , మూడవ సారి తిరిగి నడవబోతు ఆ అబ్బాయిని చూసి ఆగి దగ్గరికెళ్ళాడు .
బాబు అప్పట్నించి అటు వైపు చూస్తున్నావ్ , ఎవరైనా నీ కోసం వస్తారా ?? ఇంటికి తీసుకెళ్ళ డానికి అని అడిగాడు . -"కాదు బస్ కోసం ఎదురు చూస్తున్నాను "అని ఆ కుర్రవాడు సమాధానం ఇచ్చాడు .
-" బస్ కోసం అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఓ వంద అడుగుల దూరమంతే చూడు అక్కడ బస్టాప్లో ఉంటే బస్ ఎక్కొచ్చు. ఇక్కడ బస్సు ఆపరుగా" అని చెప్పి నా , ఆ కుర్రాడు వినకుండా అక్కడే నిల్చున్నాడు .
ఆ పెద్దాయన మళ్ళీ చెప్పాడు బస్టాప్ అదో కనిపిస్తుందే అక్కడా , ఇక్కడ కాదు అని అయినా ఆ కుర్రాడు అక్కడే నిల్చుని , కాదు బస్సు ఇక్కడే ఆగుతుంది నాకు తెలుసు అని సమాధానం ఇస్తునాడు .
అలా ఓ నాలుగు సార్లు చెప్పి ఐదో సారి చెప్పబోతున్నంతలో బస్సు ఆ మలుపు తిరిగి వస్తూనే ఉంది . బాబు ఎందుకు లేట్ అవ్వడం చీకటి పడబోతుంది బస్టాప్లో నిల్చో ఇక్కడ బస్సు ఆపరు అని ఆ పెద్దాయన మళ్ళీ చెప్పాడు .కాని ఆ కుర్రాడు కాదు బస్సు ఇక్కడే ఆగుతుంది అని అదే సమాధానం ఇచ్చాడు .
బస్సు అలా వచ్చి ఆ బాలుడు నిల్చున్న చోటే ఆగింది . ఆ పిల్లాడు బస్సు ఎక్కి వెనక్కి మళ్ళీ , చెప్పానుగా బస్సు ఇక్కడే ఆగుతుందని , ఎందుకంటే బస్సు డ్రైవరు మా నాన్న అంటూ గబ గబా లోపలి పరుగెట్టాడు .
నిజమే బస్సు డ్రైవరు మన పరలోక తండ్రి అయితే బస్సు స్టాప్ తో మనకేం పని . ఒక వేళ మన అమ్మ గవర్నరు అయ్యుంటే రాజభవన్లోకి వెళ్లేందుకు మనకెందుకు అనుమతి ? అలాగే ఎప్పుడైతే మన హృదయాన్ని , రాజుల రాజు , ప్రభువుల ప్రభువైన ఏసయ్యకు ఇస్తామో ఇంక ఏలాంటి పెర్మిషన్ అవసరం లేదు మనకి . ఎప్పుడంటే అప్పుడు ఆయనని హత్తుకుని సావాసం చెయ్యొచ్చు

No comments:
Post a Comment