It is not just a "Name"
-----------------------
తు థు... వాడి పేరు నా ముందు ఎత్తకు అన్న మాట చాలా సార్లే విని ఉంటాం .
పేరు అనగానే ఆలోచిస్తున్నా ..
లోకంలో మనుషులకు , ప్రాణులకు పేర్లు లేకుండా ఉంటే లోకం ఎలా ఉండేదా అని ?
ఒకరినొకరు ఎలా పిలుచుకునే వాళ్ళు ?
జంతువులను పక్షులను ఇవి-అవీ అని ఎలా చెప్పేవాళ్ళు ?
అంతే కాదు
ఒక వేళ మనుషులు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ ప్రవర్తనని బట్టి పేరు పెట్టే పద్ధతి ఉంటే అప్పుడు మనుషులకు
ఎలాంటి పేర్లు ఉండేవా అని ??
అస్సలు పేర్లు పెట్టడం ఎక్కడ మొదలై ఉంటుందని ?
ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని లేఖనానుసారమైన మాటలు గుర్తొచ్చి
ఆశ్చర్యం వేసింది .
ఆది కాండము 2 వ అధ్యాయం 2 వ వచ్చనంలో -" దేవుడు తాను చేసిన పని యేడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని యంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను " అని ఆయన సృష్టి నంతటిని చేసాడు , ఆ మొదట చేయ బడ్డ వారికి కూడా పేర్లు లేవు ఆదాము అనగా మట్టి నుండి చేయబడిన , లేదా మొదటి మనుష్యుడనే తప్పా ఆయనకూ పేరు లేదు .మరి ఎక్కడ పేర్లు పెట్టడం మొదలయ్యింది ??
ఆది కాండం 2 వ అధ్యాయం 19 వ వచ్చనంలో " దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ,ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ,ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను " అని ఉన్నట్టు చూస్తాం . అంటే సృష్టి చేసిన తరువాత దేవుడు పేర్లు పెట్టే అవకాశం మనిషికే యిచ్చాడు కదూ .
తరువాత " అబ్రామును " అబ్రహాముగా .సారాను శారా గా పేర్లు మార్చడం , యాకోబును ఇశ్రాయేలుగా పేరు మార్చి పేరులో ఉన్న కళంకాన్ని , అపజయాన్ని తీసివేసి కొత్త పేరును ఇవ్వడం , గర్భంతో పారిపోతున్న హాగారును ఆ ఎడారిలో పలకరించి పుట్టకముందే శిశువు పేరు ఇస్మాయేలు అని పేరు కూడా పెట్టమని చెప్పిన దేవుడుగా కూడా చూస్తాం .
అలాగే కీర్తనలు 147 : 4 లో "- నక్షత్రముల సంఖ్య ను ఆయనే నియమింఛి యున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు " అని చూస్తాం అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టాడంటే ఆయన సృష్టించిన ప్రతియొక్క సృష్టము మీద ఎంత శ్రద్దో కదా ..!!
ఆకశామండలములోని నక్షత్రాలకే కాదు ఆయన మనకి కూడా పేర్లు పెట్టేశాడు తల్లి గర్భంలో ఉండగానే .ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు . మన గల్లీకో ఇంటికో లేక ఏ పెద్ద సమావేశంలోనో ఏ ప్రధాన మంత్రో , రాష్ట్రపతో వచ్చి పేరు పెట్టి నిన్ను పిలిస్తే ఎలా ఉంటుంది ??
జక్కయ అని ఒక పొట్టి మనిషి యేసుప్రభువును చూడాలని ఎవరికీ తెలియకుండా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు .ఆ చెట్టును దాటివెళ్ళకుండా యెసయ్య చెట్టు పైకి చూసి జక్కయ కిందికి దిగిరా మీ ఇంటికి వెళ్దాం అని పిలిచినప్పుడు ఎంత సంతోషం వేసి ఉంటుందో ? నా పేరు ఈయనకెలా తెలుసనీ ఆశ్చర్యం . ఈయనకు నేను తెలుసు అన్న ఆనందం .
ఎప్పటి నుంచో నీపేరు , నా పేరు దేవునికి తెలుసా అన్న సందేహం ఉండి ఉంటే ఇక ఆ సందేహం అవసరం లేదు .ఆయనకీ మన ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు .. నువ్వు ఆయన వైపు చూడు ఆయన పిలుస్తూనే ఉంటాడు కాని నువ్వు పలుకుతున్నావో లేదో ?
సరే కాని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ పేరు నీకు మంచి తెస్తుందో చెడు తెస్తుందో ? లేక నీపేరు పిలవగానే జనాలకు ఎంత మంచి గుర్తోస్తుందో అని ;

No comments:
Post a Comment