Thursday, October 11, 2012

కుక్క వలె ఉండగోరుతున్నావా? లేదా కుమారుని వలె ఉండగోరుతున్నావా ?
-------------------------------------------------------------------------------------------------------
        నేడు విశ్వాసి అయిన నిన్ను ప్రభువు ప్రశ్నిస్తున్నాడు ? సురేఫెనకయ స్త్రీ రొట్టె ముక్కను కుక్కకు వేసినట్టు స్వస్థతను వేయమని అడిగింది .కాని యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి " నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని  యున్నాను "అని ప్రభువు చెప్తుంటే మనము మన విశ్వాసంలో ఇంకా రాతి నేలలో పడ్డ విత్తనంలా విశ్వాసపు వేళ్లు హృదయ లోతుల్లోనికి వెళ్ళక ,కుమారుని స్థితిని కోరుకొనక  కుక్కలా కొంచెం కొంచెం అవసరతను బట్టి వేయమని /విసరమని /జాలి పడమని అడుగుతున్నాం .!!
        
          ఆ అడిగేది కూడా  ఎలా అడుగుతున్నాం ?తెరుచుకోని  గొంతుల్లా ..స్వరం  పెగలని  వీణలా కదూ  ..ఎండిపోయి బీటలు  వారిన భూమి వర్షం కోసం ఎలా రోదిస్తూ  మొరపెడుతుందో గొంతు తడపమని ఆలోచించావా ..?సంఘానికొచ్చి  సహవాసంలో కూడి ఇలాంటి  స్తుతి , ప్రార్ధన చేస్తూ మళ్ళీ ఎదలోకే తిరిగొచ్చే ప్రార్ధనలా , బలం లేక చచ్చిపోయే విత్తనంలా మన ప్రార్ధన ఎందుకుండాలి?

        జ్ఞాపకం ఉందా ? యెరికోలో త్రోవ ప్రక్కన తిమ్మాయి కుమారుడైన గుడ్డి బిక్షగాడు ,ఎంతగా గొంతు చినిగేల అరచి ప్రభువుని పిలిచాడో  ..?ఆయన స్వరం ప్రభువు చెవిలో పడేవరకూ " దావీదు కుమారుడా నన్ను కరుణించుమని"  కేకలు వేస్తూనే ఉన్నాడు .మరి ఈ రోజు నువ్వు ఎలా ఆయనకి మొరపెడుతున్నావ్ ? ఒక సారి ఆలోచించు .ఒక వేళ  బిక్ష కోసమే అడిగి ఉంటె అతడు" ఆర్తిగా అయ్యా" అని దీనమైన స్వరం తో అరిచేవాడు కాని ఆ గ్రుడ్డివాడు ఆ రోజు భిక్ష కోసం అక్కడ కూర్చునట్టు లేదు .యేసు ప్రభు వారి గురించి వినే ఉంటాడు .యేసయ్య  చేసిన అద్భుతాలని గూర్చి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే  ఆ సురేఫేనకయ స్త్రీ లా తెలుసుకునే  ఉంటాడు .అతడి మనో నేత్రాలు ఆయన రాకకై  ఆ పాదాల కొరకై ఆ దారిన ఎంత ఎదురుచూసాయో ?
      గమనించు అద్భుతం ముందు తనకై దాగి ఉందని గ్రహించి , ఆ భిక్షగాడు ఆ సమూహాన్ని భిక్షమడగడం  లేదు కాని .ఆయనకీ జీవితాంతం సరిపడ  దీవెన కావాలి .ఆ సురేఫెనకయ స్త్రీ కి కూడా  తన జీవితాంతం మర్చిపోలేని స్వస్థత కోసం వరం అడుగుతుంది .ఎలా అడుగుతున్నారో ఈ ఇద్దరు గమనించారా?

       గ్రుడ్డి వాడు భిక్షకోసం కాదు ఏదో పొందాలని అరిచాడు అతడి స్వరం ఆయన చెవిన  పడింది .జీవితానికి సరిపడా అద్భుతం పొంది ఆశ్చర్యం అయి నిలిచాడు సాక్షిగా ..
       సురేఫెనకయ స్త్రీ వేడుకోలు ప్రభువుకు ప్రీతి కరమైంది అందుకే ఆమె విశ్వాసం పండింది .దీవెన పొందింది ఘనమైన విశ్వాసం అని ధృవీకరణ పొందుకొని వెళ్ళింది.

       ఇద్దరు కుక్కపిల్లల వలె ఎదురు చూస్తూ  వేరే వారి దయకోసం కనిపెట్టారు .కాని ఆయన వారి విశ్వాసాన్ని బట్టి వారి వేడుకోలులో ఆర్ధతను బట్టి వారిని అక్కున చేర్చుకున్నాడు .

       ప్రభువు ఈ దిన్నాన నిన్ను కుమారుడని పిలుస్తుంటే నువ్వు ఎలా వుండలనుకుంటున్నావ్ ?

        కుక్కలా భిక్ష కోసం, రొట్టె ముక్కాల కోసం చూస్తూ కొలతల్లో ఆశీర్వాదం కావాలా?లేక  కుమారుడుగా     ఉండి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని సాక్షార్ధంగా నిలబడ గోరుతున్నావా ??
..... ఇక నీదే నిర్ణయం ..

(ఆదివారపు ఆరాధనప్పుడు ఆయన నాలో మొలకెత్తింప చేసిన కొన్ని తలంపులు ) 

No comments:

Post a Comment