Saturday, October 13, 2012

ఒక విత్తనం
--------------
ఒక విత్తనం ఎక్కడి నుంచో ఈ నేలనుపడి మొలకెత్తింది .
ఏ తడి ఏ ప్రవాహం ఆ విత్తనాన్ని నెట్టుకొచ్చి భూమిలోకి చేర్చిందో  నిర్వీర్యమ్మైన విత్తనం  మృతుని చూసి,
ఆయువును పోసుకొని బ్రతికినట్టు ..
పాపమును బట్టి , లోకానికై  చచ్చిపోతూ పునరుజ్జీవం పొందుతున్న ఆత్మకు 
అది రెండవ జన్మమేగా ..

విత్తనం ,విత్తనంగా మిగిలి ఉంటే..  

వృక్షాన్ని తనలో చూసుకుని ఉండకపోతే ..
అక్కడ మట్టిలో ఏ చలనపు స్థితి లేక మిగిలి పోయి ఉండేది .
చావు , జీవాన్ని ఇస్తుందా ?? కాదు అని అవును అని చెప్పలేము అనుకుంటే ఎలా ?? విత్తనం చచ్చి వృక్షం కోసం రూపు దాల్చుకుంటున్నట్టు, ఒక చావు ఇంకో జీవానికి శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా నాంది పలుకుతుంది.

చావంటే ప్రతి ఒక్కరికి భయమే కానీ ఎప్పటికీ  బ్రతికుండాలంటే  ఆ చావు రుచి చూసే ఉండాలి.లేక పోతే జీవాన్ని గూర్చిన ఆలోచన రాదు .  విత్తనం చనిపోతేనే కదా కొన్ని వందల సంవత్సరాలు బ్రతికే వృక్షంగా జీవాన్ని నింపుకోగలదు.


విత్తనం భూమిలోనే చావాలి .ఆ భూమిలో దాక్కుని తన పొరలను ఒలుచుకుంటూ  చావు కౌగిలిలో అక్షయమైన జీవాన్ని విశ్వాసంతో అంటుకట్టబడి పెంపొందించుకుంటూ , మరో జీవం కోసం ఎదురుచూస్తూ తిరిగిజన్మించాలి అప్పుడే విత్తనపు జన్మకి సార్ధకత .


నువ్వు విత్తనం ,భూమి అయిన యేసు లోకి చేరి , ప్రభువు" కృప "తడిని  ఆత్మ ప్రోక్షనని స్పృశించి మరో జీవనానికి వ్రుక్షమవడానికి  బ్రతికే ఆశను నింపుకుని అక్షయతను అణువణువునా తొడుగుకొనగలిగితే అదే కదా 

పునరుజ్జీవం ,అదే కదా రెండవ జన్మం , అదే కదా క్షయం నుంచి అక్షయానికి  ప్రయాణం .
మరణం నుంచి జీవంలోకి దాటి వెళ్లడం ..
( నా చేతిలో ఉన్న విత్తనం నాతో మాట్లడకనే వాక్యాన్ని గుర్తుచేస్తూ  మాట్లాడిన విషయం -)

3 comments:

  1. Wonderful...Raa Thalli! Even I've never thought it so deeply! Perfect Exposition! God bless U.

    ReplyDelete
  2. Awesome!such a simple truth yet it has never occurred to us; such a simplest way of putting the glorious truth. God Bless You Mercy dear.

    ReplyDelete